2019లో వైసీపీ తరపున MPలు వీరే..

43289
SHARE

అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. 2014లో పలు కాంగ్రెస్ పార్టీనుంచి చేరిన పలు సీనియర్ లీడర్లతో జిల్లాలో పట్టు సాధించిన టీడీపీ క్రమేపీ పట్టు కోల్పోయింది. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీనేతల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతుండడంతోపాటు వర్గ విబేధాలు సైతం తారాస్థాయికి చేరాయి. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో పటిష్ఠంగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అనంత చేరికతో మరింత బలోపేతమైంది. గ‌త ఆరు నెల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌ల‌స‌లు.. ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌లు, ప్ర‌ముఖులు, కార్య‌క‌ర్త‌లు… ఇలా నిత్యం ఎవ‌రో ఒక‌రు టీడ‌పీలో చేరుతూనే ఉన్నారు. కానీ.. హ‌ఠాత్తుగా ఓ ఛేంజ్. ఇటీవల ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు దావానంలా వ్యాపించాయి. వైసీపీలోకి టీడీపీ సహా ఇతర అన్ని పార్టీలనుంచి వైసీపీలో చేరుతున్నారు‌. గతంలో పార్టీ అధినేత జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి ప‌లువురు అనంతపురం టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేరారు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో రామగిరి టీడీపీ నేతలు కాంగ్రెస్ నేత వెంకట్రాముడులు చేరారు.

అయితే గతం నుంచీ జగన్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నార‌ని బెంగ లేద‌ని, స్వార్థం నిండిన వారే స్వ‌ప్రయోజ‌నాల‌తో వెళుతున్నార‌ని, కార్య‌కర్తలు మాత్రం వైసీపీతోనే ఉన్నార‌ని చెప్పారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా బలమైన నేత అనంతవెంకట్రామిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే యోచనలో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ పవన్ మంచి మిత్రులు. ఈ స్నేహం ఇప్పటిది కాదు చిన్నప్పటినుంచే. అన్ని అనుకూలిస్తే పవన్ రెడ్డి వైసీపీ లోచేరి అనంత నుంచి ఎన్నికల బరి లో దిగవచ్చు. దివాకర్ రెడ్డి మళ్లీ పోటి చేసేంత ఓపిక తనకు లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్ అనంత నియోజకవర్గం పై పట్టు బిగించే యత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జేసీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీని చూసి కాదు, నా తండ్రిని చూసి ఓటేయండి అంటూ అనంతపురం నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేశాడు. తమ నాయకుడు వైసీపీ నుంచి పోటీ మాత్రం ఖాయం అంటున్నారు పవన్ రెడ్డి అభిమానులు.

అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే పరిటాల సునీత ఆమె కొడుకు శ్రీరామ్ ఆగడాలు రోజురోజుకీ పెచ్చు మీరుతుండడం జిల్లావాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేతల్ని గెలిపించామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సునీత జడ్పీటీసీ ఎన్నికల సమయంలో చేసిన ఉదంతంతో స్థానికంగా ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాలతో సునీతకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. పైగా జేసీ దివాకర రెడ్డికి ప్రబాకర్ చౌదరి, పరిటాల సునీతలకు మధ్య వర్గ విభేదాలు నిత్యం రాజుకుంటున్నాయి. ఈ క్రమంలో జేసీ టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులైన రఘువీరారెడ్డి, మాజీమంత్రి శైలజానాధ్ లను వైఎస్సార్సీపీలోకి తెచ్చేలా జగన్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. ఎలక్షన్ కు ఇంకా రెండేళ్లు సమయం ఉండడంతో వీరు కూడా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమీకరణాలతో అనంత గడ్డపై వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.