రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ చలవే

895
SHARE

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చలువేనని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. పైడిపాలెం రిజర్వాయర్‌ను రైతులతో కలిసి అవినాష్ రెడ్డికి వైయస్‌ఆర్‌కు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్‌ 90శాతం పనులను పూర్తి చేసింది వైయస్‌ఆరే నన్నారు. కేవలం రూ.24 కోట్లు ఖర్చు చేసి అంతా తామే చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరు ఎత్తితేనే రాష్ట్ర ప్రజలందరికీ వైయస్‌ఆర్‌ గుర్తుకు రావడం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు 80 శాతం పనులు చేసిన ఘనత వైయస్‌ఆర్‌దేనన్నారు. గండికోట నుంచి పైడిపాలెం ట్రయల్‌ రన్‌ చేసి నీరు ఇచ్చామంటే ఇచ్చినట్లు చెప్పుకోవడానికి టీడీపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందన్నారు.