పోలవరం ప్రాంత రైతులు తరుపున జగన్ ఏపీ సర్కార్ కు వార్నింగ్

331
SHARE

వైకాపా పార్టీ అధినేత వైయస్ జగన్ పోలవరం ప్రాంత రైతుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇటీవల మూలలంక గ్రామ రైతులు జగన్ ను కలసిన్నారు. తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని జగన్ గారికి తెలిపారు. ఈ సమస్యపై తానూ సమగ్రంగా అధ్యయనం చేసి స్పందిస్తానని వారితో చెప్పిన విషయం తెలిసిందే. కాగా నేడు వైయస్ జగన్ ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు. ప్రభుత్వం పోలవరం రైతుల విషయంలో అనుసరిస్తున్న విధానాల పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నడూ లేని విధంగా వైాయస్ జగన్ ప్రభుత్వం పై విమ‌ర్శాస్త్రాలు సంధించారు. పోలవరం మూలలంక రైతుల, కృష్ణ నది తీరంలో లంక గ్రామాల రైతుల కన్నీరు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదని వైయస్ జగన్ అన్నారు.

మూల లంక లోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అనుమతి లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంత వరకు సమంజసమో ప్రజాప్రతినిధులే చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి ఎంపీ రాయ పాటి సాంబ‌శివరావు గుత్తేదారు కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ఆడగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మారు స్తుంటే ఈ విషయంలో స్పందించని ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని వైయస్ జగన్ మండిపడ్డారు. అక్కడ భూమి ఉన్న రైతులు తమవారు కాదనా లేక కాంట్రాక్టరు కు ఇబ్బందనా ? ప్రభుత్వం ఎందుకు నిర్లక్యం చేస్తోందని వైయస్ జగన్ ప్రశ్నించారు. గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం అడిగితే వారి మోర ఎందుకు వినరంటూ వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమరావతి లోని లంక గ్రామా ప్రాంత రైతుల భూముల విషయం లోను వైయస్ జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాము దళితులం కావడం వల్లే పరిహారం చెల్లింపు విషయం లో తమ పై ప్రభుత్వం విపక్ష చూపుతోందని అక్కడి రైతుల ఆవేదనని వైయస్ జగన్ తెలియజేసారు. ఇది సమాజానికి మంచిది కాదంటూ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల్ని టోకుగా కాకుండా ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్న వైకాపా అదినేత వైయస్ జగన్.. దృష్టి తాజా గా పోలవరం మీద పడింది.

‘‘పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక.. అమరావతి ప్రాంతంలోని కృష్ణ నది లంకభూముల రైతుల కన్నీరు ఆంధ్ర ప్రదేశ్ కు క్షేమదాయకం కాదు. పోలవరం ప్రాజెక్ట్ పక్కనేఉన్నమూలలంకలోని 207 ఎకరాల మగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్యార్డ్ గా మార్చటం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతి నిధులు చెప్పాలి’’ అని అన్నారు. అదే సమయంలో ఏపీ అధికారపక్షానికి చెందిన టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన కాంట్రాక్ట్ సంస్థపైనా ఆయన ట్వీట్ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

‘‘తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్ స్ట్రాయ్ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్ గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న వివేకం కూడా చూపకపోతే ప్రజా ప్రతినిధులను ఏమనుకోవాలి? పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కారు ఈ సమస్య పై ఎందుకు దృష్టి పెట్టటం లేదో అర్థం కావటం లేదు’’ అని నిలదీసినట్లుగా ట్వీట్ చేసిన జగన్.. నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టటమే కాదు.. పోలీసుల సాయంతో వారిపై ఒత్తిడి తెస్తుందన్న కోణాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు.

ఇందులో భాగంగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. ‘‘ఈ భూముల రైతులు తమ వారు కాదనా? లేక కాంట్రాక్టర్ కు ఇబ్బందనా? గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర్ర ఎందుకు వినరు? పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా వారికి న్యాయం చేయండి’’ అని ఫైర్ అయ్యారు. కులాల ఆధారంగా నష్టపరిహారం మారుతుందని.. దళితులకు చెల్లించే నష్టపరిహాంలో వివక్ష గురి అవుతున్న విషయాన్ని సరికొత్తగా చెప్పిన వైయస్ జగన్.. ‘‘అమరావతిలోని కృష్ణా నది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని కాంక్షించే వారు అర్థంచేసుకోవాల్సి ఉంది.

తాము దళితులం అయినందువల్లే తాము నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురి అవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు’’ అని మండిపడ్డారు. నది పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అసలు నిబంధనల్ని ఫాలో అవుతున్నారా? లేదా? అన్న సందేహంతో పాటు..ప్రభుత్వం తీసుకుంటున్న భూములు ఎందుకన్న విషయాన్ని రైతులకు వివరించరా? అన్న ప్రశ్నను సంధించారు. అనుమతులపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా లేదన్న వైయస్ జగన్ తన ట్వీట్ లో.. ‘‘అసలు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నది పరివాహకంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు.

అక్కడ నిర్మాణాలు చేపట్టటానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదు. ఈ భూముల ను తీసుకొని ఏం చేస్తారో ముందుగా ప్రజలకు లేదంటే కనీసం రైతులకైనా తెలియజేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక.. తన చివరి ట్వీట్ లో భూసేకరణ చేపట్టేందుకు ముందు నష్టపరిహారంపై ప్రభుత్వం చెప్పిన దానికి.. అమలు చేస్తున్న విధానాలకు సంబంధం లేదన్నట్లుగా ఉందన్న సందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చిన వైయస్ జగన్.. పట్టా రైతులకు ఒకలా.. లంక భూముల రైతులకు మరోలా నష్టపరిహారం ఇవ్వకూడదని.. అందరికి ఒకేలాంటి నష్టపరిహారం అవసరమన్న వాదనను వినిపించారు.

ఈ అంశంపై ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. ‘‘భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో.. అంత ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా.. లంక భూముల రైతులకు మరోలా వివక్ష పాటించటం మంచిది కాదు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేస్తున్నాడు. మరి.. తాజా ట్వీట్లపై ఏపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.