గూగుల్ ట్రెండింగ్ లో బాబు కంటే జగన్ నెంబర్ వన్ ..

2295
SHARE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత ,ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూగుల్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు .చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ..పెట్టిన మీటింగ్ కు తను చెప్పే మాటలకు సంబంధం లేకుండా చెప్పే ఏకైక మాట “తెలుగు రాష్ట్రాలకు టెక్నాలజీను పరిచయం చేసింది నేనే అని ..అలాంటి టెక్నాలజీ రంగంలో పెను సంచనాలకు వేదికవుతోన్న గూగుల్ లో టెక్నాలజీను పరిచయం చేసిన జబ్బా చరుచుకుంటున్న చంద్రబాబు ను వెనక్కి నెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధమ స్థానంలో నిలిచారు.

అయితే గూగుల్ లో ఇంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధమ స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం నిత్యం వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడటమే కాకుండా ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు ,అటు కేంద్రంలో బిజేపీ సర్కారు గత ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదాపై మాట మార్చడమే కాకుండా ..ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విధానంపై జగన్ పోరాడుతున్న తీరు ..ఎప్పటికప్పుడు జగన్ చేసే పోరాటాలు సోషల్ మీడియాలో జగన్ అభిమానులు మొదలు సామాన్య ప్రజలు ,జగన్ మద్దతుదారులు అప్ లోడ్ చేయడం ..ఏపీ సర్కారు ను ప్రజల సమస్యలపై పోరాడుతూ ముప్పై తిప్పలు పెడుతూ ..మూడు చెరువుల నీళ్ళు త్రాగించడమే కాకుండా ప్రభుత్వం దిగోచ్చే వరకు పోరాడుతుండటం ..జగన్ ప్రభుత్వ వైపల్యాలపై ఎలా పోరాడుతున్నాడో ఆసక్తితో గూగుల్ సెర్చ్ చేయడమే కాకుండా జగన్ పేరిట తన అభిమానులు ,పార్టీ కార్యకర్తలు నడిపించే పేజి లలో కూడా సెకండ్ సెకండ్ జగన్ గురించి అప్ డేట్ చేయడంతో జగన్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో జగన్ బాబు కంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

ఇక చంద్రబాబు గురించి చెప్పుకోవాలంటే ఈ ఏడాదిలో నెలకు ఒకరు చొప్పున అన్నట్లు సాక్షాత్తు మంత్రిగా పనిచేస్తున్న నారాయణ కళాశాలల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు మొదలు నిన్న గుంటూరు జానీ మున్నీ ,ఇటీవల ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటిపై ఐటీ దాడుల మొదలు నిన్న కాగానే మొన్ననే అక్రమాస్తుల్లో దొరికిన టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వరకు పలు అవినీతి అక్రమాలతో బాబుకు ప్రతిష్ట మసకబారడమే కాకుండా ప్రజలలో కూడా తన అభిమానాన్ని కోల్పోయి గూగుల్ ట్రెండింగ్ లో వెనకబడటమే కాకుండా దాదాపు ముప్పై శాతం కంటే తక్కువ మంది సెర్చ్ చేశారు .