పేదలకు, అంగ వికలాంగులకు ఉచిత విద్యను అందిస్తున్న జగన్ కుటుంబం..

2742
SHARE

వెనకబడిన రాయలసీమ లోని పులివెందుల లో పేదలకు ఉన్నతమైన విద్య అందించేదానికి మహానేత రాజశేఖర్ రెడ్డి గారి గురువైన శ్రీ వెంకటప్ప గారి ఆశయ సాధనం కోసం పులివెందుల లో శ్రీ జి. వేంకటప్ప మెమోరియల్ స్కూల్ పెట్టి పేద విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను అందిస్తున్న కుటుంబం వైయస్ కుటుంబం.

ఈ స్కూల్ తో పాటు పులివెందుల లో విజేత స్కూల్ అని పెట్టి అంగ వికలాంగులకు విద్య ను అందిస్తున్న విద్య దాత ఆ కుటుంబం. గతం లో రాజా రెడ్డి గారి పేరుమీద కాలేజీ లు పెట్టి వాటి బాధ్యతలను లయోలా కాలేజీ కు అప్పగించి పులివెందుల లో ఉన్నత విద్య ప్రమాణాలతో విద్య ను అందిస్తున్న కుటుంబం వైయస్సాఆర్ కుటుంబం !

అసలు వెంకటప్ప స్కూల్ పేరుకే ప్రైవేట్ స్కూల్ కానీ, అందులో ప్రవేశం కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకే. పైసా కూడా ఫీజు లేకుండా ఉన్నత మైన విద్య ప్రమాణాలతో విద్య ను అందిస్తూ, ఆ స్కూల్ బాధ్యతలను ఏంత్తో శ్రద్దగా తన సొంత పిల్లలలకు చదువు చెప్పిస్తున్నాం అన్న రీతిలో స్కూల్ ను నడిపిస్తున్న ఒక అమ్మ మన వైయస్ భారతమ్మ గారు.

ఈ స్కూల్ లో 2400 మంది విద్యార్థులకు సకల సౌకర్యాలతో విద్య ను అందిస్తూ, ఇంకా విద్యార్థులు వస్తున్నా కూడా స్కూల్ కెపాసిటీ ఇంతే అని ఇతర స్కూల్స్ లో ఫీజు కట్టి వారికీ విద్య అందేలా చూస్తున్న గొప్ప కుటుంబం వైయస్సాఆర్ కుటుంబం !! పేదల అభివృద్ధి పట్ల ఇంత చిత్తశుద్ధితో రాష్ట్రము లో ఆలోచించిన కుటుంబాలను వేళ్ళ పై లెక్కపెట్టొచ్చు !!

ఇలాంటి కుటుంబం పైన ఎలా పడితే అలా ప్రచారం చేయడానికి సిగ్గుండాలి !!

వైయస్ జగన్ అన్న తన పార్టీ మేనిఫెస్టో లో కేజీ నుండి పీజీ వరకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య అందించి రాష్ట్రాన్ని విద్యప్రదేశ్ గా చూడాలని ఉన్నత ఆశయం తో ఉన్నాడని మనకందరికీ తెలిసిందే, ఆ ఆశయ సాధన లో మనవంతు భాగస్వామి అవుదాం !! మన పెద్దాయన గురువు వెంకటప్ప గారి, రాజన్న ఆశయ సాధన లో పాలుపంచుకుందాం !!