జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం

552
SHARE

ఎపిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న మీడియా విపక్ష నేత జగన్ పై దుష్ప్రచారం చేయడానికి విపరీత యత్నం చేసిందని కధనం వచ్చింది.అందులో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.జగన్ ను పోలీసుల విశాఖ ఎయిర పోర్టులో నిలిపివేసినప్పుడు జరిగిన సంభాషణలలో ఆయన అన్నది ఒకటైతే, ఎల్లోమీడియా దానిని వక్రీకరించి చూపిందని, అలాగే పత్రికలలో రాసిందని ఆ కదనంచెబుతోంది.‘నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను అడ్డగిస్తున్నారు. అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా’ అన్న వ్యాఖ్యను వక్రీకరించి నేను ముఖ్యమంత్రిని నన్నే పట్టుకుంటావా అని వ్యాఖ్యానించినట్లుగా సొంతపైత్యం జోడించారని ఆ కధనం వెల్లడించింది.జగన్ అనని మాటను అన్నట్లు చెప్పడానికి ఎల్లో మీడియా విపరీతంగా తాపత్రయ పడిందని ఆ కధనంలో వ్యాఖ్యానించారు.