వైకాపా పార్టీలోకి వల్లభనేని వంశీ చేరడానికి ముహూర్తం ఖరారు..

19773
SHARE

దాదాపు రెండు సంవత్సరాల క్రితం.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న రోజుల్లో కృష్ణా జిల్లా టీడీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వార్తల్లో నిలిచాడు. తెలుగుదేశం నేత అయ్యుండి.. ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడిని జనాల మధ్య ఆలింగనం చేసుకోవడం ఆసక్తికరంగా నిలిచింది. దీంతో వల్లభనేని జగన్ వైపు చేరిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. వంశీ టీడీపీలోనే ఉండిపోయాడు.

ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి కొన్ని రోజుల తర్వాత వంశీ టీడీపీలో యాక్టివ్ అయ్యాడు. తర్వాత డీ యాక్టివ్ అయ్యాడు. ఆయనకున్న పార్టీ పదవిపోయింది. ఆయన అభిమానించే హరికృష్ణకు టీడీపీలో ప్రాధాన్యం తగ్గింది. ఒకసారి వంశీని చంద్రబాబు కూడా పిలిపించుకుని మాట్లాడాడు. అయితే ప్రస్తుతం వంశీ మోహన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని తెలుస్తోంది. వంశీకి మొదటి నుంచి గన్నవరం సీటు మీద ఆసక్తి ఉంది. ఇక్కడ నుంచి తాను సులభంగా గెలవగలనని ఆయన భావిస్తున్నాడు. అయితే.. టీడీపీ లో వంశీకి ఆ సీటు లభించే పరిస్థితులు కనపడటం లేదు. ఆ విషయాలు అని కాసేపు పక్కన పెట్టితే అసలు విషయంలో వెళ్ళదాము.

టీడీపీలో చుక్క ఎదురు అయన వంశీ కి వైకాపా పార్టీల నాయకులతో కలిసి మాట్లాడుతున్నాడు అని సమాచారం ఎందుకు గన్నవరం నుంచి పోటీచేసే ప్రక్కగా గెలుపు ఖాయం కనుక అక్కడ నుండి పోటికి సిద్దంగా ఉన్నాడు వంశీ ఈ విషయం మాట్లాడానికి కొడాలి నాని దగ్గరకు వెళ్ళిన్నాడు. మరోక విషయం ఏమిటి అంటే పార్టీలోకి రావడానికి డేట్ పిక్స్ చేయడానికి వెళ్ళిన్నట్లు సమాచారం.కాని సంక్రాతి తరువాత పార్టీ పగ్గాలు పట్టుతున్నాడు అని అన్నారు. వంశీ తో పాటు టీడీపీ కొంత మంది కార్యకర్తలు వస్తున్నారు దాదాపు 20 మంది వస్తారు అని సమాచారం.

రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరిగుతాయ అనేది ఎవరుకూ తెలియని విషయం ఎందుకు అంటే మెన్న వైకాపా పార్టీలో నుండి టీడీపీ లో వెళ్ళుతున్నారు అని చానెల్స్ వారు ప్రచారం చేసిన్నారు కాని అది కాస్తం తప్పు ప్రచారం ఎందుకు అంటే ప్రజలు కాని రాజకీయం విశ్లేషకులు కాని అటు ప్రతిపక్షనేతలు కాని ఒకే ఒక్క మాట అంటున్నారు 2019లో ఎన్నికల్లో వైకాపా పార్టీనే గెలుపు ఖాయం అని అంటున్నారు…