ప్రత్యేక కారులో అవినీతి సొమ్మును తరలిస్తూ పట్టుబడిన టీడీపీ మంత్రి..

16182
SHARE

ఎపి కి సంబందించిన ఒక మంత్రి తను అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును భద్రపరచడానికి ఒక ప్రత్యేక కారు వాడతారట. తెలుగు గేట్ వే డాట్ కామ్ లో దీనిపై ఆసక్తికర కధనం వచ్చింది.దానిని చదవండి.

ఆ ఏపీ ‘మంత్రి’ కారును కేవలం అందుకే వాడతారు. కేవలం కరప్షన్ మనీని తరలించటానికే దాన్ని వినియోగిస్తారు. దానికి ఓ ప్రత్యేక డ్రైవర్ కూడా ఉంటాడు. అతగాడి పని కూడా చెప్పిన చోటకు..చెప్పిన సమయంలో వెళ్లి డబ్బు కట్టలు తీసుకురావటమే. అంతే తప్ప..అందులో ఎవరూ ప్రయాణించరు. అందుకు అనుమతించరు. దాని పని కేవలం డబ్బు తరలించటమే. బహుశా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అవినీతి సొమ్మును తరలించేందుకు ఇలా ప్రత్యేక కారు ఏర్పాటు చేసుకున్న మంత్రి ఆయన ఒక్కరే అని పార్టీ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. మాట్లాడితే నీతి కబుర్లు చెప్పే ఆయన ఈ మధ్య కాలంలో భారీగా కూడబెట్టుకున్నారు. కానీ ఇంకా తాను అప్పుల్లోనే ఉన్నానని..అసలు తనకు అవినీతి అంటే ఏంటో తెలియదనే నీతి కబుర్లు చెబుతుంటారు.
రాజధాని ప్రాంతానికి చెందిన ఈ మంత్రి పై ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కబుర్లు చెప్పటం తప్ప..పార్టీ క్యాడర్ కు కూడా దేనికి ఉపయోగపడరని చెబుతున్నారు. ఈ దందా ‘పెద్దల’ ఆశీస్సులతోనే సాగుతుండటంతో ఆయన కూడా హ్యాపిగా ఆ ప్రత్యేక కారును లాగించేస్తున్నారు. ప్రస్తుతం ఆ కారు ఫుల్ స్పీడ్ గా తిరుగుతుందట. ఎందుకంటే ఆయనకు అంత గిరాకీ ఉంది మరీ. ఇంత చేసి కూడా ఆయన చెప్పే వినే నీతులు వినలేక పార్టీ నాయకులు కూడా విసుగుచెందిపోతున్నారు.