కర్నూలులో ఫ్యాను గాలికి కొట్టుకుపోయిన తెలుగుదేశం.. వైస్సార్సీపీలో చేరుతున్న బైరెడ్డి , శిల్పా సోదరులు..

16103
SHARE

2014ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కడప తర్వాత అంతటి ఘనవిజయాన్ని అందించింది కర్నూలు జిల్లా.. కర్నూలు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్సీపీ లో గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలు టీడీపీలోకి వెళ్లడంతో జిల్లా వైసీపీ బలహీనపడిందనే వార్తలొచ్చాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో నలుగురు టీడీపీలో చేరారు. నమ్మిన నేతలు చేజారడం, ఎస్వీ మోహన్‌ రెడ్డికూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జగన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా వైసీపీలోకి కూడా చేరికలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ యువనేత, కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ వైసీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మకు నమ్మినబంటుగా పేరుపడ్డ మురళీకృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సమక్షంలో వైఎస్ జగన్ మురళీకృష్ణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అయితే పవన్, మోడిల గాలివాటంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గెలిచిన తర్వాత వైసీపీకి బలమైన జిల్లా కావడంతో కొందర్ని మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. బలమైన ప్రతిపక్ష పార్టీగా మారిన వైసీపీని ఎదుర్కోలేక నానా తంటాలు పడుతోంది. వైసీపీకి పట్టున్న జిల్లాల్లో టీడీపీ పాగా వేయడం సంగతి అటుంచితే.. గత ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యం చూపించిన కర్నూలు జిల్లాలో టీడీపీ క్రమక్రమంగా ఉన్న పట్టునూ కోల్పోతోంది. జిల్లాకు చెందిన ముఖ్యనేత భూమా నాగిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా వైసీపీహవా ఏమాత్రం తగ్గలేదు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీలో చేరితే పార్టీకి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు కోట్ల వైసీపీనేతలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో కోట్ల ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలు కొనసాగించేవారని, దీంతో ఆయనతోపాటు భార్య సుజాతమ్మ కూడా వైసీపీలో చేరుతున్నట్టు దాదాపుగా ఖరారైంది. రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌ను ఏపీలో క‌నుమ‌రుగైపోవడంతో కోట్ల వైసీపీ గూటికి చేరితే జిల్లాలో వైసీపీకి తిరుగులేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

ఇదే జ‌రిగితే క‌ర్నూలు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురవడం ఖాయమట.. అదే విధంగా గత ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే టికెట్ భూమాకు కేటాయించడంతో ఆయన వైసీపీలోకి వస్తారని దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. శిల్పా చక్రపాళిరెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా రామభూపాల్ రెడ్డి, చక్రపాళిరెడ్డిలు వైసీపీవైపు చూస్తున్నారనే ప్రజారం సాగుతోంది. వీరితోపాటు రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ వేదిక క‌న్వీన‌ర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డికూడా జగన్ గూటికి చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జంపింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భైరెడ్డి..

”చెప్పు తీసుకుని కొట్టాలి. వారికి మరో సమాధానం లేదు. ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టాలి. దొంగలు, చెత్తగాళ్లు, చేతగాని ముండనాకొడుకులు, ప్రజల తీర్పును కాదని మరో పార్టీలోకి వెళ్లడం అంటే మొగుడిని విడిచిపెట్టి మరొకడి దగ్గర పడుకోవడమే.అంతకు మించి మరొకటి కానేకాదు” అంటూ ఆగ్ర‌హంతో వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్య‌లు మాత్రం అధికార పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. జగన్ పార్టీకి మద్దతు పలుకుతూనే భైరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. జగన్ పార్టీలోచేరి ఓ కీలక శాఖ మంత్రిగా ఉంటూ రాయలసీమ ప్రాంతానికి సేవ చేయాలనే యోచనలో భైరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భూమా పోయినా వచ్చే ఎన్నికల్లోపు భైరెడ్డి, కాటసాని, కోట్లల చేరికతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 2014కంటే మంచి ఫలితాలే జిల్లాలో పార్టీకి వస్తాయని వైసీపీనేతలు భావిస్తున్నారు. వీరంతా పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.