ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ పతనం స్టార్ట్..

1816
SHARE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలో ఒకటైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్‌, హర్షకుమార్‌లు వైసీపీలో చేరుతున్నట్టు ఒక ప్రముఖ దినపత్రిక కథనం. త్వరలోనే వీరు వైసీపీలో చేరుతారని, పార్టీనాయకత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టినట్టు సదరు పత్రిక చెబుతోంది. వీరిద్దరి చేరికను బలపరిచేలా వైసీపీ ఇటీవల చేసిన మార్పులను పత్రిక ప్రస్తావించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగిన 2004, 2009లో ఉండవల్లి, హర్షకుమార్‌ ఇద్దరూ కాంగ్రెస్ తరపున ఎంపీలుగా గెలిచారు. అయితే అప్పట్లో దివంగత వైఎస్‌తో ఉండవల్లికున్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన జగన్ వెంట రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

ఇక పోతే అమలాపూరం మాజీ ఎంపీ హర్షకుమార్ విషయానికి వస్తే ఆయన పార్టీలో చేరడానికి అంతా సిద్ధమైందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆ పత్రిక కథనం. మొన్నటి ఎన్నికల్లో అమలాపురం నుంచి వైసీపీ తరపున విశ్వరూప్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి విశ్వరూప్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఇన్ ఛార్జీగా వున్న విశ్వరూప్ ను ఇటీవల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా నియమించారు. దీంతో హర్షకుమార్‌కు లైన్‌ క్లియర్ అయిందంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వైఎస్ ఉన్నప్పుడు ఆయనతో హర్షకుమార్ పెద్దగా సఖ్యతతో ఉండేవారు కాకపోయిన కానీ జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి హర్షకుమార్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడగా… జగన్‌ స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఇక మరో వైపు ఆ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అని టాక్ .ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ముఖ్యనేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశంపై చర్చించేందుకే ముద్రగడతో సమావేశమయ్యారు అని వైసీపీ వర్గాల్లో ఇదే రకమైన ప్రచారం జరుగుతోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి వైసీపీకి మద్దతు ఇవ్వడంతో వైసీపీలో చేరి మీ ఎజెండాతో ఉద్యమాలు చేసుకోవచ్చని… ఇందుకోసం వైసీపీ అధినేత జగన్ ను ఒప్పిస్తామని భూమన ముద్రగడకు హామీ ఇచ్చినట్టు సమాచారం.ఈ ఇద్దరు మాజీ ఎంపీలు మరియు కాపు ఉద్యమ నేత వైసీపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా మాదిరిగా వచ్చే ఎన్నికలో తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ గిర్రున తిరగడం ..సైకిల్ షాప్ కు పోవడం ఖాయం అని ఆ పత్రిక కథనం ..