వైకాపా ఎమ్మెల్యె ల పై తెలుగుదేశం పార్టీ కుట్ర

1562
SHARE

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకోనుందా ? విపక్షానికి చెందిన ఇద్దరు జగన్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు త‌ప్ప‌దా ? అంటే అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల అరెస్టుకు దాదాపు రంగం సిద్ధ‌మైంద‌నే తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డిలు ఇద్దరూ ఇప్పుడు కల్తీ మ‌ద్యం కేసు ఉచ్చులో చిక్కుకున్నారు.

2014 ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కల్తీ మద్యం పంపిణీ చేశారని సీఐడీ నిగ్గు తేల్చటమేకాదు.. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాల్ని సేకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. క‌ల్తీ మ‌ద్యం కేసులో ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేయాల్సి ఉండ‌గా వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేప‌థ్యంలోనే వీరిని అరెస్టు చేయ‌లేదు.

2014 ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 నకిలీ మద్యం కేసులు నమోదవగా.. నెల్లూరు జిల్లాకు సంబంధించి 11 కేసుల్లో సీఐడీ విచారణ పూర్తిచేసింది. దర్యాప్తు అధికారులు గురువారం నెల్లూరు సీఐడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో పై ఇద్దరు ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మందిని నిందితులుగా ఉన్నట్లు చెబుతున్నారు.

గత ఎన్నికల సమయంలో వీరు కల్తీ మద్యాన్ని గోవా, క‌ర్ణాట‌క నుంచి తెప్పించినట్లు విచారణలో తేలినట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్ద‌రి ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేస్తే జగన్ వర్గానికి భారీ షాక్ ఇవ్వోచ్చు అని టాక్.