సోషల్ మీడియా దెబ్బకు బాబుకు దిమ్మ తిరిగింది..

1931
SHARE

నారా లోకేష్ బాబు ఈ మధ్య ఏం చేసినా.. అది చినిగి చాట అంత అవుతుంది. రెండు నెలల క్రితం పార్టీ సమావేశాలకు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ తనదైన సందేశం విన్పించారు. ఇదంతా ఒకెత్తు అయితే లోకేష్ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేపింది. హోం మంత్రి చినరాజప్పకు వేలు చూపిస్తూ లోకేష్..లేచి నిలుచుని మాట్లాడుతున్న చినరాజప్ప ఫోటోకు సంబంధించి ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు.

అక్కడ నిజంగా ఏమి జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోయినా ..ఆ ఫోటో చూస్తే మాత్రం నారా లోకేష్ తనకంటే వయస్సులో చాలా పెద్దవాడైన..ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు సరైన గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం మాత్రం వ్యక్తం అయింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అయితే దీనిపై స్పందించి లోకేష్ హోం మంత్రిని అవమానించారని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంపై హోం మంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. వైసీపీ కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని..ఇలా చేసేవారిపై కేసులు పెడతామని ప్రకటించారు. ఏది ఏమైనా లోకేష్ ఫోటో మాత్రం పార్టీలో కూడా కలకలం రేపింది.

అయితే సేమ్ సీన్ తండ్రి చంద్రబాబుకు ఎదురైంది. ముచ్చర్ల ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజు అక్కడి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య హాజరయ్యారు. ఆ వేడుకలో ఐజయ్యకు అసలు వచ్చే అవకాశం లేదన్న బాబు.. ప్రాజెక్ట్ గురించి నాలుగు మంచిమాటలు చెప్పి వెళ్లిపోమన్నాడు. మైక్ తీసుకున్న ఐజయ్య ప్రాజెక్టు , చంద్రబాబు గురించి మాట్లాడటం వదిలేసి.. అసలు ప్రాజెక్ట్ ప్రారంభించిందే రాజశేఖర్ రెడ్డి అని మాట్లాడాడు. దీంతో చంద్రబాబు అవేశంతో ఊగిపోయారు. వెంటనే సదురు ఎమ్మెల్యే మైక్ కట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వచ్చింది. దీంతో బాబు తన ప్రారంభోత్సవం ఫోటోలు టీడీపీ అధికార ఫేస్ బుక్ పేజీలో పెట్టారు కానీ.. సభ సంబంధించిన ఫోటోలు పెట్టలేదు. దీంతో బాబు బయపడే ఆ ఫోటో పెట్టలేదని అంతా అనుకుంటున్నారు.