జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తో దుమ్ము రేగిన సోషల్ మీడియా..

8584
SHARE

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌ల నిండా జగనే. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే అభిమానుల ఫొటోలు, వీడియోలతో ఫేస్‌బుక్‌ పేజీలు నిండిపోయాయి. ఒక్క పది నిమిషాలు ఓపెన్‌ చేసి కూర్చుంటే చాలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే మెసేజ్‌లతో పోన్‌ మెమరీ నిండిపోతుందని అభిమానులు సంతోషంగా చెప్పుకుంటున్నారు. అసలే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న జగన్‌ అభిమానులు ఆయన పుట్టినరోజున మరింత రెచ్చిపోతారని ఊహించిందే. అయితే ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయారంతా. ప్రతిపక్ష నాయకుడికి సీఎంకు మించి ఉన్న క్రే జ్‌ చూస్తుంటే అసలు సీఎం ఎవరా అని అనుమానం కలిగేలా ఉంది. నిన్న రాత్రి నుంచే కేకు కటింగ్‌లు, సంబరాలతో ఫొటోలు ఫేస్‌బుక్కును పోటెత్తాయి.

ఇదంతా చూస్తుంటే ఎప్పుడు డిసెంబర్‌ 21 వస్తుందా.. ఎప్పుడు విషెష్‌ చెబుదామా అని ఎదురుచూసినట్టుంది. దానికితోడు వైయస్‌ఆర్‌సీపీ అఫిషియల్‌ ఫేస్‌బుక్‌లో విషెస్‌ చెప్పడానికి అవకాశం కల్పించడంతో అక్కడా వీడియోల మోతే. జగన్‌కు శుభాకాంక్షలు చెప్పే వీడియోలు వైయస్‌ఆర్‌సీపీ అఫిషియల్‌ పేజీలో గంటలకొద్దీ ఒకదాని తర్వాత ఒకటి గంటలకొద్దీ ప్లే అవుతూ కనిపించాయి. ఎన్నివేల మంది వీడియోలు పంపించారో మాత్రం వారే చెప్పాలి. అయితే ఈ వీడియోల్లో విచిత్రంగా చాలా మంది అభిమానులు ఆయన్ను కాబోయే ఏపీ సీఎంగా చూస్తుండగా, ఇంకొందరైతే సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని విషెస్‌ చెప్పడం విశేషం. జగన్‌ అభిమానుల ఊపు చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావాలనే కోరుకుంటున్నట్టుంది.