2019లో జగన్ పార్టీకు మద్దతు ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..

9787
SHARE

ప్రత్యేక హోదా అంశంపై జగన్ ఓ వైపు దూకుడుగా వ్యవహరిస్తుంటే తాము వెనకబడిపోతామనే ఉద్దేశంతో కూడా పవన్ కల్యాణ్ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. జగన్ దూసుకుపోతే రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న తాము ప్రభుత్వం పట్ల మెతకగా వ్యవహరిస్తే వెనుకబడిపోతామని భావించిన పవన్ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబందించి పవన్‌కు గత కొంతకాలం నుంచీ మాజీ ఐఏఎస్, ఐపిఎస్ సూచనలు చేశారని, అందువల్లనే ఆయన తన వైఖరి మార్చుకున్నారని అంటున్నారు.

ప్రత్యామ్నాయంగా రావాలంటే ఇదే…
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నామనే భావనకు తెరదించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్‌కు సలహాదారులు సూచించినట్లు చెబుతున్నారు. అందుకే ఆయనతన వ్యూహం మార్చుకుని, ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించినట్లు చెబుతున్నారు. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం వర్గాలు కూడా ఇక పవన్ సొంత దారి చూసుకుంటున్నారనే నిశ్చయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడుగా వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్‌పై విమర్శలు చేయని పవన్ కల్యాణ్..
ప్రత్యేక హోదా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని అంటూ గతంలో వైయస్ జగన్‌ను కూడా టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికార పార్టీలను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. హోదాపై జగన్ పోరాటం చేస్తున్నందున ఆయనను విమర్శిస్తే కొంత వ్యతిరేకత ఎదురు కావచ్చుననే అభిప్రాయం కూడా పవన్ కల్యాణ్‌కు ఉండవచ్చునని అంటున్నారు. జగన్, పవన్ కల్యాణ్ పోటాపోటీగా ప్రత్యేక హోదాపై నిరసన ప్రదర్శనను కొనసాగించారని చెప్పవచ్చు. ఈ స్థితిలో ఆచరణలో తప్ప మాటల్లో ఒకరినొకరు విమర్శించుకోలేని వాతావరణాన్ని కల్పించుకున్నారని అంటున్నారు.