ఏపీ యువత పందులాట ఆడుకుంటే.. నువ్వు బ్యాంకులకు ఏకనామం పెడతావ…

396
SHARE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం సర్కారు ,అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారుపై ప్రముఖ సినిమా హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు .ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ యువత తమకు అన్యాయం జరిగింది అని ..తమిళనాట సంచలనం సృష్టించిన జల్లికట్టు ఉద్యమం ఆదర్శంగా తీసుకొని నిన్న జనవరి 26న కొవ్వొత్తుల ర్యాలీను నిర్వహించతలపెట్టింది.అయితే తము చేయకపోయినా కానీ యువత ముందుకు రావడాన్ని మెచ్చుకోవాల్సి పోయి యువత చేస్తోన్న ఉద్యమం గురించి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సుజన చౌదరి అవహేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు .

పవన్ కేంద్ర మంత్రి సుజన పై ఫైర్ అవుతూ “యువత ఉద్యమం చేయకుండా పందుల ఆట ఆడుకుంటుంటే మీరు బ్యాంకులకు కోట్ల రూపాయలను ఎగ్గొట్టి అన్ని బ్యాంకులకు ఏకానామం పెడతరా ..?మీరు యువతను హేళన చేస్తూ మాట్లాడటం పద్దతి కాదు .యువత తలచుకుంటే మీరు ఢిల్లీ నుండి గల్లికి రప్పించగలరు.ఇకనైనా మీరు హేళన మాటలు పక్కనపెట్టి ఉద్యమానికి మద్దతు ఇవ్వండి .మీరు ఇచ్చిన ఇవ్వకపోయిన మేము ఏమి చేతులు కట్టుకొని కూర్చొని ఉండం ..మేము చేయాల్సిన పోరాటం చేస్తాం ..మీరు మాత్రం అదే స్పూర్తితో బ్యాంకులకు కోట్ల రూపాయలు ఏకానామం పెట్టండి అంటూ సుజనపై ఫైర్ అయ్యారు .