జగన్ని తట్టుకోవటం టీడీపీకి వల్ల కాదు..

9252
SHARE

కరుడు గట్టిన రాయలసీమ టీడీపీ లీడర్‌ పరిటాస సునీత.. మంత్రిగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాయల సీమలో టీడీపీకీ అండగా ఎదురులేని నాయకులుగా ఆ కుటుంబం ఉంది. అలాంటి నాయకులురాలు పరిటాల సునీత టీడీపీ గెలుపుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె మాటలు టీడీపీ పార్టీలో.. సొంత నియోజక వర్గంలో కలకలం రేపుతున్నాయి.

ఒక దిన పత్రికతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె పులివెందులలో టీడీపీ గెలవదన్న విషయం తమకూ తెలుసన్నారు. పులివెందులకు నీరు ఇచ్చినా అక్కడ ఒక్క ఎమ్యేల్యే కూడా గెవవరని బల్ల గుద్ది చెప్పారు. అయినా అక్కడి రైతుల బాగు కోసమే చంద్రబాబు నీరు ఇచ్చారని పరిటాల సునీత చెప్పారు. అయితే పనిలో పనిగా జగన్ తీరుపై మండిపట్టాడు సునీత.

జగన్ సీఎం అయితే రాష్ట్రంలో హత్యలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ స్వప్రయోజనాల కోసం యువతను రెచ్చగొడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. కడప జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామని చంద్రబాబు చెబుతుంటే పరిటాల సునీత మాత్రం పులివెందులలో ఏమి చేసినా టీడీపీ గెలవదన్న విషయం తమకు తెలుసనడం ఆసక్తిగా ఉంది.