వైసీపీలోకి ఓ జాతీయ పార్టీ నేత..

9873
SHARE

ఏపీలో ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వైఎస్సార్‌ కాంగ్రెస్ లో చేరనున్నారు. తాను ఈ నెల 12న వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్టు దుర్గేష్‌ ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తానని, అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు.. ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితిలో లేదు ఈనేపధ్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ జనగళాన్ని సమర్థవంతంగా విన్పిస్తోన్న వైసీపీలో చేరడానికి తాను ఆకర్షితుడనయ్యానని దుర్గేష్ చెప్పారు.