చంద్ర‌బాబు చ‌రిత్ర బ‌య‌ట‌పెట్టిన కేవీపీ..

4253
SHARE

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చారిత్రాత్మ‌కంగా నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హ‌రంలో కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామంచంద్ర‌రావు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చ‌రిత్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. చంద్ర‌బాబు చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని… పోల‌వ‌రాన్ని త‌న క‌ల‌గా చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం విచిత్ర‌మ‌ని ఆయ‌న ఎద్దేవ చేశారు.

చంద్ర‌బాబుకు ఆల్జిమర్స్ వ్యాధి ముదిరి మెగ‌లోమేనియా ద‌శ‌కు చేరింద‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఒక్క శాతం కూడా చంద్ర‌బాబు పాత్ర లేద‌ని కేవీపీ గుర్తు చేశారు. ఇందిరా సాగ‌ర్ పోల‌వ‌రం ప్రాజెక్టు పేరును పోల‌వ‌రం ప్రాజెక్టు గా మార్చడం ప‌ట్ల ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ప్రాజెక్టుకు నిధుల‌న్నీఇందిరా సాగ‌ర్ పేరుతోనే విడుదల‌య్యాయ‌ని గుర్తు చేశారు.

ఈ నేప‌ధ్యంలో పోల‌వ‌రాన్ని తాము అడ్డుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం సిగ్గుచేటు అన్నారు.అబ‌ద్దాలు చెప్ప‌డానికి హ‌ద్దు ఉండాలి అంటూ చంద్ర‌బాబుకు కేవీపీ హిత‌వు ప‌లికారు. రాజ‌కీయంగా బిక్ష పెట్టి.. సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉన్న నిన్ను ఎమ్మెల్యే టికెట్టు కేటాయించి త‌మ బ‌లంతో ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
మంత్రి ప‌ద‌వి రావ‌డం చేత‌నే ఎన్టీ రామారవు అల్లుడిగా స్ధిర‌ప‌డ‌టానికి ఇందిరా గాంధీనే కార‌ణ‌మ‌ని అన్నారు. అలాంటి ఇందిర‌మ్మ పేరును పోల‌వ‌రం ప్రాజెక్టు నుండి తొల‌గిస్తావా అంటూ చంద్ర‌బాబుపై కేవీపీ విరుచుకుప‌డ్డారు.