చంద్రబాబుకు షాక్.. త్వరలో వైసీపీలో చేరనున్న కదిరి టీడీపీ ఇన్ చార్జి…

5888
SHARE

రాయలసీమలో టీడీపీ కంచుకోట అనంత పురం జిల్లా అనే చెప్పాలి..గత ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది..జిల్లా మొత్తం టీడీపీ హవా నడిచింది..అయితే ఈ టీడీపీ కంచుకోట క్రమంగా బీటలు వారుతుందా అంటే నిజమే అనిపిస్తుంది..ఇప్పుడు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలను చూస్తే గత కొంతకాలంగా అనంతపురం జిల్లా లో టీడీపీ బలహీనపడుతోంది..ముఖ్యంగా జేసీ బ్రదర్స్ కు, జిల్లా టీడీపీ శ్రేణులకు విబేధాలు తారాస్థాయికి చేరాయి..వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ పోటీ చేస్తే మాత్రం ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది..ఎందుకంటే అక్కడి టీడీపీ క్యాడరే జేసీ బ్రదర్స్ ను ఓడిస్తారనడంలో సందేహం లేదు..ఇక కదిరి నియోజకవర్గంలో కూడా టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో సతమవుతుంది..కదిరి నియోజవర్గ ఎమ్మెల్యే చాంద్ బాషా గతంలో టీడీపీలోనే ఉండేవాడు..సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై గెలిచాడు.. ఆ తర్వాత ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఇప్పుడు కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు..అయితే టీడీపీ ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చాంద్ భాషా మళ్లీ సైకిలెక్కాడు…తనను ఓడించిన చాంద్ బాషా ను మళ్లీ పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ కందికుంట చంద్రబాబును గట్టిగానే నిలదీశాడు..అయితే చంద్రబాబు పార్టీలో ఇద్దరకి సమన్యాయం ఉంటుందని కందికుంటను బతిమలాడి చాంద్ బాషా చేరికపై ఒప్పించాడు..పార్టీ అధినేత బుజ్జగింపుతో కందికుంట అఇష్టంగానే చాంద్ బాషా చేరికను ఆహ్వానించాడు…అయితే గత కొంత కాలంగా వీరిరువురి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది..కందికుంట వర్గం చాంద్ బాషాను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు..అటు చాంద్ బాషా అన్ని విషయాల్లో కందికుంట వర్గాన్ని పక్కన పెడుతూ తన అనుచరులకే పెద్ద పీట వేస్తున్నాడు..దీంతో కందికుంట తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు..

మొన్నీ మధ్య నియోజవర్గంలోని ఓ మండలంలో ఎంపీపీ ఛైర్మన్ పదవిని వైసీపీ గెలిచేచోట టీడీపీ ధనబలంతో గెలిచింది..అయితే మొదటి నుంచి పార్టీలోని ఉన్నవారికి కాకుండా జంప్ జిలానీలకే పెద్ద పీట వేస్తున్నారంటూ కదిరి నియోజకవర్గంలోని మండలాల్లో స్థానిక టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..తాజాగా తనగల్లు మండలంలోని ఎంపీపీగా ఉన్న లక్ష్మీ ఆధ్వర్యంలో ఓ చిన్నపాటి మీటింగ్ జరిగింది..నిన్నటి సమావేశంలో లక్ష్మీ మాట్లాడిన తీరు టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉంది..ఎమ్మెల్యే చాంద్ బాషా తీరుతో పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారు ఎవ్వరూ సంతోషంగా లేరని..మున్ముందు పార్టీలో పరిస్థితి ఇలానే ఉంటుందని..ఇక్కడ ఉండడంకన్నా మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామా చేద్దాం అంటూ స్థానిక ప్రజా ప్రతినిధులకు పిలుపు ఇచ్చింది..సమావేశానికి హాజరైనవారంతా ఆమెతో ఏకీభవించి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని ఏకగ్రీవంగా నిర్ణయించారంట..రేపో మాపో కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాలలో టీడీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసే అవకాశం ఉంది..వీరంత కందికుంట వర్గం కావడం విశేషం..దీంతో త్వరలో కార్యకర్తల అభీష్టం మేరకు కందికుంట కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..కందికుంట టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి చేరితే టీడీపీ కంచుకోట బద్ధలు కావడానికి ఇదే నాంది అని చెప్పవచ్చు..