వైఎస్, జగన్ లను టచ్ చేసిన వారంతా కాలక్రమేణా ఏమైపోయారో చూడండి…

6364
SHARE

యాధృచ్చిక‌మో దైవ నిర్ణ‌య‌మో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజ‌కీయంగా మాన‌సికంగానూ తీవ్రంగా న‌ష్ట‌పోయారు. వైయస్సార్ మ‌ర‌ణానంత‌రం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న జ‌గ‌న్ ను గ‌త కొన్నేళ్లుగా చాలామంది తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందుల‌ు ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ ప‌ద‌వుల‌కోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధ రాజకీయాలకోసం జ‌గ‌న్ ను, వైయస్సార్ ను నిందించిన‌వారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమ‌య్యారో చూడండి.

మొద‌టిగా జ‌గ‌న్ ఆస్తుల‌పై విచార‌ణ చేయాల‌ని మాజీ మంత్రి శంక‌ర్రావు సీబీఐకు లేఖ రాసారు. జ‌గ‌న్ కేసులు న‌డిచినంత కాలం కాంగ్రెస్ తో పాటు టీడీపీ నేత‌లు సైతం శంక‌ర్రావును ఓ రేంజ్ లో పైకి ఎత్తేసారు. అనంత‌రం శంక‌ర్రావు ప‌రిస్థితి అత్యంత దారుణంగా త‌యారైంది. కిరణ్ కుమార్ రెడ్డి హ‌యాంలో త‌న‌మంత్రి ప‌ద‌వి పోగొట్టుకొవ‌డం తోపాటు అరెస్ట‌య్యారు. ఇంట్లో ఉన్న శంక‌ర్రావును బ‌ట్ట‌లు వేసుకునేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. శంక‌ర్రావు త‌ర్వాత జ‌గ‌న్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్డ మ‌రో మంత్రి ఎర్ర‌న్నాయుడు దుర‌ద్రుష్ట‌వ‌శాత్తూ రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు.

జ‌గ‌న్ ను, వైఎస్సార్ ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన మ‌రో టీడీపీ నేత రేవంత్ రెడ్డి. చ‌నిపోయిన వ్యక్తని కూడా చూడ‌కుండా వైయస్సార్ ను పావురాల గుట్ట‌లో పావురం అయిపోయాడ‌ని విమ‌ర్శించాడు.. ఇప్పుడు త‌న పార్టీలో ఏకాకిలా మిగిలి టీడీపీలో త‌న రాజ‌కీయ జీవితం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. జ‌గ‌న్ జైల్లో చిప్ప‌కూడు తిన్నా బుద్ధి రాలేదు అని విమ‌ర్శించిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కై అదే చిప్ప‌కూడు తిన్నాడు. చివ‌ర‌కు త‌న కూతురు వివాహ కార్య‌క్ర‌మం లో కూడా ఆనందంగా పాల్గొనలేక‌పోయాడు.

అప్ప‌ట్లో కాంగ్రెస్ అధిష్టానం మెప్పుకోసం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసిన మ‌రో నేత డీఎల్ ర‌వీంద్ర‌రెడ్డి తాత్కాలికంగా అప్ప‌టిక‌ప్పుడు అధిష్టానం దృష్టిలో ప‌డి మంత్రి ప‌ద‌వి అందుకున్నా అదే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి హ‌యాంలో బ‌ర్త‌ర‌ఫ్ అయి ఇప్పుడు రాజ‌కీయంగా జీరో అయిపోయారు.

అప్ప‌ట్లో టీడీపీ నేత సీబీఐ మాజీ డైర‌క్ట‌ర్ విజ‌య‌రామారావు కూడా సీబీఐ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుండే వార‌ని విన్నాం. కానీ విజ‌య‌రామారావు కుమారుడు కూడా అదే సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు.

జ‌గ‌న్ కేసుల్లో పెట్టి ఇరికించ‌డంలో అప్ప‌టి హోం మంత్రి చిదంబ‌రం కూడా ప్ర‌ముఖ పాత్ర వ‌హించారు. అలాగే చిదంబ‌రం కుమారుడు కూడా సీబీఐ కేసుల్లో ఇరుక్కోగా ఆయ‌న కుమారుడిని కేసుల‌నుండి విడిపించేందుకు నానా ప్రయత్నాలు చేపట్టారు.

వీరంద‌రినీ న‌డిపించిన సోనియాగాంధీ ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. విభ‌జ‌న నేప‌ధ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోగా దేశంలో కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని చెప్పుకోవ‌డానికి ప‌ట్టుమ‌ని నాలుగు రాష్ట్రాలు కూడా లేవు. చివ‌ర‌కు వందేళ్ల‌ చ‌రిత్ర ఉంద‌ని చెప్పుకునే కాంగ్రెస్ ప్ర‌స్తుతం దేశంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా సాధించ‌లేని ప‌రిస్ధితికి వ‌చ్చింది.

ఇంకాస్త ముందుకెళ్తే 2009 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అప్ప‌ట్లో పీఆర్పీ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అవినీతి ప‌రుల‌ను పంచెలూడ‌దీసి కొడ‌తాం అంటూ వైయస్సార్ పై ప‌రోక్ష‌ విమ‌ర్శ‌లు చేశారు. అదేరోజు ప్ర‌చారంలో ప‌వ‌న్ కళ్యాణ్ త‌ల‌కు క‌రెంటు వైర్లు తీగ‌లు త‌గిలి గాయ‌ప‌డ్డారు. పైగా అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఆపార్టీ దారుణంగా ఓట‌మిపాలైంది. పైగా ఇప్పటికీ పవన్ కు రాజకీయ అనిశ్చితి లేదు. ఆయన కష్టించిపని చేసిన టీడీపీ, బీజేపీలే పవన్ ని విమర్శిస్తూ పక్కన పెట్టేసాయి.

ఏదేమైనా వైయస్సార్ కుటుంబాన్ని విమ‌ర్శించిన వారంతా ఏదొక రూపంలో న‌ష్ట‌పోయారు. అలాగే ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి దేవినేని ఉమలు కూడా తీవ్రమైన పదజాలంతో వారిని దూషిస్తున్నారు. వైఎస్ ను పోలవరం అంశంలో దేవినేని ఉమ దూషిస్తున్నారు. అదేవిధంగా కులం విషయంలో, ప్రవర్తన విషయంలో జగన్ ని విమర్శిస్తున్నారు. అయితే వీరిద్దరినీ రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలోనూ ఇంతెత్తున ఎగిరిన నేతలంతా కాలక్రమేణా ఏమయ్యారో చూశామని, రాజకీయాలు రాజకీయాల్లానే ఉండాలని లేకుంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.