బాబు హామీలతో మోసపోయిన రైతులకు వైయస్‌ జగనే ఓ ధైర్యం

327
SHARE

రైతులు, రైతు కుటుంబాలు అంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరుడికి ఎంతో ఇష్టం. అందుకే మండుటెండల్లో కాలినడకన రాష్ట్రమంతా పర్యటించిన మహానేత.. ఎక్కడికక్కడ రైతు కుటుంబాల్ని పలకరించారు. వారి కష్టాలు, కడగండ్లను తెలుసుకొన్నారు. నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. అదే బాటలో నేడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్ర సంకల్పించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి నేనున్నా అంటూ భరోసా కల్పిస్తున్నారు. అప్పులు తాళలేక ఆత్మ హత్యలు చేసుకున్న కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో జిల్లాలో రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. కరువుతో అల్లాడుతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ అనే అబద్ధపు హామీని నమ్మి మోసపోయిన అన్నదాతలు అప్పులు తీర్చే స్థోమత లేక బలవన్మరణాలకు పాల్పడ్డారు.

చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో బాధిత కుటుంబాలు మరింత క్రుంగిపోయాయి. ఇలాంటి సమయంలో చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైయస్‌ జగన్‌..తానే బాధిత కుటుంబాలను కలిసి వారిలో భరోసా నింపుతానని వాగ్ధానం చేశారు. ఇచ్చిన మాట కోసం ఆయన ఇప్పటికే అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఐదు విడతల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం నూరిపోశారు. రాయలసీమలోని మరో కరువు జిల్లా అయిన కర్నూలులో కూడా రైతు భరోసా యాత్రకు వైయస్‌ జగన్‌ సిద్ధపడ్డారు. రుణమాఫీ కాకపోవడం..వ్యవసాయం కలిసి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..జిల్లాలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో జనవరి 5 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.