వైజాగ్ ఘటనతో రాష్ట్రంలో మారుమోగిపోతున్న జగన్ నామస్మరణం..

811
SHARE

ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త కోవ్వోత్తుల ర్యాలీ అరెస్టులకు దారితీసింది. జగన్ విశాఖలో ఎయిర్ పోర్టులో ధర్నాకు దిగ‌గానే ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు బాగానే స్పందించాయి. ఈ ప్రత్యేకహోదా ఉద్యమం ఆ పార్టీని మళ్లీ ఫామ్ లోకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతి దోడ్డాపురం వీధిలోని పార్టీ కార్యాలయంలో కోవ్వోత్తుల ర్యాలీ చేపట్టారు. కరుణాకరరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులను అరెస్ట్ చేశారు.

ఎన్నికల సమయంలో మోడీతో పాటు వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ప్రశ్నిస్తున్న వారిని ప్రభుత్వం అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వైసీపీ నాయకుడు, పుంగనూరు ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. 15సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నవారు ఏమైపోయారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని తెలిపారు.

వైసీపీ అధ్యర్యంలో ప్రత్యేక హోదా కోసం కర్నూలులో క్రొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రాజ్ విహర్ కూడలిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా అధ్వర్యంలో క్రొవ్వొత్తులతో ప్రదర్శన శారు….అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ అవరణలో ఉన్న గాంధి విగ్రహం వద్ద నిరసనను తెలిపారు…. సోషల్ మీడియా ఫర్ సోసైటి ఆధ్వర్యంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విద్యార్ధులు కోరారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏలూరులో కొవ్వుత్తుల ప్రదర్శనకు హాజరవుతున్న వైసీపీ నాయకులను పోలీసుల అరెస్టు చేసారు. ఫైర్‌ స్టేషన్‌ జంక్షన్‌ వద్ద కొవ్వుత్తుల శాంతి ప్రదర్శన కార్యక్రమాన్ని అఖిలపక్షం, యువత ఆధ్వర్యంలో తలపెట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని ఇంటి నుంచి పలువురు మాజీ ఎమ్మల్యేలు, కార్యకర్తలతో భాజా భజంత్రీలతో కొవ్వుత్తులు పట్టుకొని ర్యాలీగా బయలు దేరారు. కొద్ది దూరం వెళ్ళినతరువాత పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరనస ప్రదర్శనలు నిర్వహించింది. ఈ మలుపుకు వైసీపీ సద్వినియోగం చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు బావుంటుంది.