ఇంత కష్టపడుతున్నావు ఎందుకు అన్నా!!

2855
SHARE

రాష్ట్రం లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంతలా కష్టాలు పడలేదు, అయినా ప్రజలకోసం ఆ కష్టాలను అన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అదే ముమ్మాటికీ మేరే జగన్ అన్నా!!

కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన మొదటి రోజు నుండే కష్టాల ఊబి లో ఈదుతూ దేశం లోనే బలమైన నాయకురాలిని ఎదిరించి నిలబడ్డ వ్యక్తి మీరు. ఆమె పాదాల చెంతకు రాలేదనే ఆక్రోశం తో ఎవరిమీదా లేని కేసులు పెడితే ఎదురొడ్డి నిలించింది పోరాడింది మీరే. కష్టాలు పడకుండా సుఖంగా ఉండే అవకాశమున్నా కూడా, ఇచ్చిన మాట కోసం, తండ్రి ఆశయాల కోసం ఏదయితే అది అవుతుంది అని వాళ్ళ ఒత్తిళ్లకు లొంగకుండా నిలబడ్డ నాయకుడు జగన్ అన్న.

చేయని తప్పుకు 16 నెలలు జైలు లో ఉంది కూడా ప్రజలకోసం, ప్రజల కష్టాల లో పాలు పంచుకోలేక పోతున్నానే అనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్ అన్న. తాను జైలు లో ఉంది తన చెల్లి షర్మిలమ్మ ను ప్రజల దగ్గరకు పంపి వారి కష్టాలలో వైయస్ కుటుంభం పంచుకుంటుంది అనే భరోసా ఇచ్చిన నాయకుడు జగన్ అన్న. జైలు నుండి రాష్ట్ర విభజన ను అడ్డుకోవడానికి నిరాహార దీక్ష చేసిన మహోన్నత నాయకుడు మీరు. మీ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకోసం నిత్యం పోరాడుతున్నారు ఎందుకు జగన్ అన్నా, అంటే తండ్రి ఆశయాల సాధనకోసం అనే మాట, ప్రజలు కష్టాల లో ఉన్నారు వాళ్ళను ఆదుకోవాలి అనే మాట తప్పితే ఇంకో మాట రాదు మీ నుండి.

2009-2014 . తండ్రి మరణాంతరం కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి , కష్టాలు ఉంటాయి అని తెలిసి ముళ్ల పొదలో అడుగుపెట్టారు. ఇంత వరకు వరకు రాష్ట్రం లో మీరు తిరగని ఊరు లేదు, చరిత్ర లో ప్రభుత్వ అధికారులు కూడా పోనీ మారుమూల పల్లెలకు మీరు వెళ్లారు, ఆ ప్రజల కష్టాలను తెలుసుకుని అవి పరిష్కరిస్తాను అని ఎన్నికలకి వస్తే, కొన్ని దుష్ట శక్తుల మోసపూరిత వాగ్ధానాలతో అధికారాం అనే అందలం ఎక్కి చేస్తున్న దురాగతాలు చూస్తున్నాం. మీ స్థానం లో మరెవరైనా వున్నింటే ఇంత చేసినా ప్రజలు గుర్తించలేదు అని హాయిగా కుటుంబంతో గడిపేవారు. కానీ మీరు అలా చేయకుండా ప్రజలు కష్టాలు పడుతున్నారు అని మళ్ళివాళ్ళ దగ్గరికే వెళ్ళుతున్నారు. ఈ జీవితం మీకోసం అని వారికీ చెప్పి భరోసా ఇస్తున్న నాయకుడు మీరు జగన్ అన్నా .

2014 లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఎక్కడ ప్రజలు కష్టాలలో ఉంటే అక్కడ వాయువేగం తో వాలిపోయి వాళ్లకు భరోసా , ప్రజా పోరాటాలకు తాను గొంతు కలిపి ప్రభుత్వాన్ని నిలదీయడం, రాష్ట్రం లో ఏ మారుమూల పల్లె లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే తక్షణం వాళ్ళను కలిసి వాళ్ళ బాధలు కష్టాలు విని తన వంతు పాత్రను పోషిస్తున్నాడు,అధికారం ఉంది కదా అని తెలుగు దేశం నాయకులూ అండతో తన కార్యకర్తల మీద దాడి జరిగితే 24 గంటల్లో అదే ప్రాంతంలో లో వెళ్లి అక్కడ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వతీరు ని నిరసించాడు తన వాళ్లకు నేను ఉన్న అంటూ ధైర్యం నింపిన నాయకుడు, ఇలాంటి నాయకున్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికి పొందలేరు. ఇంత కష్టపడి ప్రజలకోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు మీరు జగన్ అన్నా. ప్రజల కష్ట సుఖాలను పంచుకుని వాళ్ళకోసం ఇంతగా పని చేస్తున్న మిమ్మల్ని విమర్శిస్తున్న దగాకోరు నాయకులకు ప్రజలే బుద్ది చెప్పుతారు అని, వారి విమర్శలను కూడా మీ ఎడమ కాలితో తన్ని ప్రజలతో ఉంటున్న నాయకులు మీరు.

అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకోసం పనిచేసే ఏకైక నాయకుడు మా జగన్ అన్న అనే గర్వము తో కాలర్ ఎగరేసి చెప్పే అభిమానగణం మీ సొంతం జగన్ అన్నా !!