టిడిపి కంచుకోటను బద్దలు కొట్టిన జగన్..

13434
SHARE

చంద్రబాబు కంచుకోటను జగన్ బద్దలు కొట్టేశాడా..!? ఔను ఇప్పుడు అదే అనుమానం కలుగుతోంది. ఎందుకో మాట్లాడుకునేముందు ముందు చంద్రబాబు కంచుకోట ఏంటో చూద్దాం.. అదే పశ్చిమగోదావరి జిల్లా. ఔను ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి టీడీపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు వచ్చాయి. గోదావరి జిల్లాలో టీడీపీ తిరుగులేని ఆధిపత్యం చూపించింది.

ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా అనేక వేదికలపై చెప్పారు. ప్రత్యేకించి పశ్చమ గోదావరి జిల్లావారికి అనేక సార్లు సభాముఖంగా థ్యాంక్స్ చెప్పారు. ఇది తన సొంత జిల్లా కంటే ఎక్కువ అన్నారు. అలాంటి చంద్రబాబు కంచుకోటలో ఆదివారం వైసీపీ నిర్వహించిన బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది.

అంతేకాదు.. ఈ జిల్లా నుంచి వైసీపీలోకి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి కోటగిరి విధ్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభ విజయవంతమైన తీరు చూసి టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ప్రతిపక్షం సభ అందులోనూ అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

ఇది ప్రజల్లో చంద్రబాబు పట్ల పెరుగుతున్న వ్యతిరేకతా.. జగన్ పట్ల ఏర్పడుతున్న సానుకూలతా అన్న విషయం పక్కకుపెడితే.. చంద్రబాబు తన పనితీరుపై పునరాలోచించుకోవాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది. పట్టిసీమ కట్టిన నేలపైనే ప్రతిపక్షానికి ఇంతటి ఆదరణ అధికారపార్టీకి అంత శుభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏమంటారు..!?