జగన్ పై ప్రశంసలు వర్షం కురింపినా హరికృష్ణ….!

12491
SHARE

మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మళ్ళీ గళం విప్పారు. తన తండ్రి, దివంగత ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన 30 సంవత్సరాలలో ఎంతో ఎత్తుకు ఎదిగానని వ్యాఖ్యానించారు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం తనకు అలవాటని, జీవితంలో ఎన్నో దెబ్బలు తిని ఈ స్థానానికి వచ్చానని అన్నారు. జీవితంలో ఎవరికీ తలవంచే సమస్యే లేదని స్పష్టం చేశారు. తలవంచే తత్వమే తనకుంటే ఎన్టీఆర్ కడుపున పుట్టి ఉండే వాడిని కాదన్నారు. తన బాటలోనే తన కుమారులు కూడా నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

కానీ ఇప్పటి రాజకీయ పరిస్ధితుల ను చూస్తుంటే చాలా భాదగా ఉంది అని అన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి పరిస్ధితుల కి ఇప్పటి రాజకీయ పరిస్దితులకు చాలా తేడా ఉంది అని అన్నారు. ఆయన మాటంటే మటే అని ఆయన మాట మీద నిలబడే వ్యక్తి ప్రాణం పోయినా ఇచ్చినా మట తప్పేవాడు కాదు అని అన్నారు. అలాగే ఆయన నిరంతంర తెలుగు వారి కోసం రైతు ల కోసం తపించిపోయే వాడు అని అన్నారు.

ఇప్పుడు రాజకీయనాయకుల్లో జగన్ ఒక్కడే సీనియర్ ఎన్టీఆర్ ని తలపిస్తున్నాడు అని అన్నారు. అందుకే జగన్ ప్రత్యేక హోదా గురించి,రైతు రుణామాఫీ కార్యక్రమాలు చేపడుతూంటే ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు అని అన్నారు. జగన్ కూడా సీనియర్ ఎన్టీఆర్ లాగా చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నాడు అని అందులో భాగంగానే గడప గడప కి అనే కార్యక్రమం ప్రజల్లో తీసుకువచ్చాడు. అందులో భాగంగా నాయకలందరి ని ప్రజల కి దగ్గర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న గారు కూడా నాయకుల కు ఎప్పుడు ప్రజల మద్యే ఉండాలి అని కోరుకునే వాడు అని అన్నారు. ప్రత్యేక హోదా విషయం లో మోడీ ని సైతం జగన్ డిమాండ్ టేసినందుకు అతన్ని అభినందించాడు.