పశ్చిమలో ఉప్పొంగిన జనకెరటాలు.. ద్వారకతిరుమలలో జగన్ కు ఘనస్వాగతం…

775
SHARE

వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ద్వారకతిరుమలలో ఘన స్వాగతం లభించింది. పోటెత్తిన జనం ప్రవాహం మధ్య వైయస్ జగన్ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. జై జగన్ జన నినాదాలతో వేదిక హోరెత్తింది. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు బహిరంగసభకు భారీగా తరలివచ్చారు. జన ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లా సముద్రాన్ని తలపించింది.

కాసేపట్లో వైయస్ జగన్ సమక్షంలో కోటగిరి విద్యాదర్ రావు తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ మాజీ నేత బలరాం సహా పలువురు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరనున్నారు.