గండికోట కటించింది వైస్ అనటానికి సాక్ష్యాలు..

1598
SHARE

రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణా వరదజలాల మీదుగా గాలేరు-నగరి కోసం పోతిరెడ్డిపాడుకు కొత్త గేట్లు 44,000 క్యూసెక్కులు తీసుకునేట్లు నిర్మించారు. అక్కడి నుంచి నీళ్లు ముందు బనకచర్ల చేరడానికి పాత కాలువ సరిపోదు కాబట్టి కొత్త కాలువ తవ్వుతున్నారు.. ఇప్పటికీ ఆ పనులు పూర్తికాలేదు బనకచర్ల నుంచి గోరుకల్లు కూ కొత్తకాలువ పనులు పూర్తికాలేదు. ఈ గోరుకల్లు రిజర్వాయర్ చూస్తే.. నిర్మాణదశలో ఇక్కడి భూమిపొరలపై ఎన్నో అనుమానాలొచ్చాయి. మొత్తంగా శ్రీశైలం కుడికాలువ,గాలేరు-నగరిల కోసం 12.5టీఎంసీల నీరు నిలువ చేయొచ్చు.. కానీ 1.78టీఎంసీలు ఈ ఏడు నింపగా లీకేజీలు మొదలై సమీపగ్రామంలో నీటి బుగ్గలు వస్తున్నాయి. ఈ గోరుకల్లు నుంచి శ్రీశైలం కుడికాలువకు సమాంతరంగా కొత్తగా గాలేరు-నగరి కాలువ 20,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకువెళ్ళి అవుకుకు చేరాలి… అవుకు రిజర్వాయర్ కు ముందు టన్నెల్ నుంచి పోవాలి… ఆ టన్నెల్ పనులు కాదుగదా ఈ గోరుకల్లు రిజర్వాయర్ కు కూతవేటు దూరంలో ఉన్న పాణ్యం దగ్గర కూడా కాలువ పనులు పూర్తికాలేదు. గాలేరు-నగరి కాలువ ఔకు నుంచి మొదలై కడపజిల్లా గండికోట చేరుతుంది…ఆ జిల్లాలో కొన్ని రిజర్వాయర్లు నింపి చిత్తూరు జిల్లా చేరాలి.

ఇక గండికోట.. గండికోట సామర్ధ్యం ముందుగా 16 టీఎంసీలు ఉంటే వైఎస్ దాన్ని 26.85టీఎంసీలకు లకు పెంచారు…ఇక్కడి నుంచి దిగువకు నీళ్లు చిత్తూరు జిల్లా వైపువెళితే…రిజర్వాయర్ నుంచి 5,6 చోట్ల చిన్న లిఫ్టులు పెట్టి నీటిని పులివెందుల నియోజకవరగంలోని పైడిపాలెం,చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేర్చాలి.. పైడిపాలెం, కొండాకోనల మధ్య ఉండే ఈ ఊరిలో ఒక చిన్న చెరువుండేది.దీన్ని 6టీఎంసీలకు పెంచారు..ఇక్కడి నుంచి నీళ్లను ఇదివరకే ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు పంపించి అనేక గ్రామాలకు,పులివెందులకు మంచినీటిని సరఫరా చేయాలని,మిగిలిన నీళ్లను..మహా అయితే 25,000 ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే ఉడ్డేశంతో నిర్మించారు. ఇక ఈ పులివెందుల బ్రాంచ్ కెనాల్ అన్నది చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ నుంచి మొదలవుతుంది. చిత్రావతి రిజర్వాయర్…తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు ఇక్కడికి చేరుతాయి…1973 నాటికే తయారైంది ఇది..కానీ కర్నాటక లో ఆ డామ్ దగ్గర పూడికో, అక్కడి కాలువలవెంట జలచౌర్యమో, శిధిలావస్థకు చేరిన కాలువల వల్లో కానీ మొత్తానికి 3,4 ఏళ్లకొకసారి ఈ కాలువ కింద పంటలు పండుతాయి..

దీని సామర్ధ్యం 4.4టీఎంసీలు.. చుట్టుపక్కల కురిసిన వర్షాధారం 2టీఎంసీలు ఉండగా వైఎస్ హయాంలో ఆయకట్టు స్థిరీకరించి రైతులకు నీళ్లివ్వాలని దీని సామర్ధ్యాన్ని 10టీఎంసీలకు పెంచారు. నిర్మాణం 2009 నాటికే పూర్తయింది. ఈ వివరం మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ irrigation.cgg.gov.in లో చూడొచ్చు. అయితే ప్రస్తుతం మేము తొలిసారిగా గండికోటకు నీళ్లిచ్చామని డంకా బజాయిస్తున్నారు ప్రస్తుత టీడీపీ నాయకులు. కానీ నిజానికి 2013 లోనే ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం గండికోట నిర్వాసితులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చింది. కానీ అసలు పూర్తేకానీ గాలేరు-నగరి కాలువలు,ఔకు టన్నెల్ ఉన్నాయి. ఇక దొడ్డిదారిలో అంటే శ్రీశైలం కుడి కాలువ ద్వారా నీళ్లు ఔకు చేర్చి.. ఇదివరకే అక్కడ పనులు పూర్తైన కాలువల ద్వారా గండికోట చేరుస్తున్నారు. ప్రస్తుతం గండికోటలో 4టీఎంసీల నీళ్లున్నాయి. వీటిలో ఎన్ని నీళ్లు పైడిపాలెంకు ఎత్తిపోయబోతున్నారోననిపిస్తోంది. ఇక పైడిపాలెం అంచనా విలువ 712.31 కోట్లు కాగా ప్రభుత్వ వెబ్‌సైట్ లో 31/05/2014 నాటికి 644.65 కోట్లుగా ఉంది. అంటే ఇది ఎప్పుడో పూర్తైంది. కానీ నీళ్లు లేక,ఇలా దొడ్డిదారి తెలియక వినియోగంలోకి తీసుకురాలేకపోయారు.. ఇక మిగిలిన డబ్బేమైంది? ఇంకా సుమారు 67 కోట్ల దాకా ఉంటుందా? అవును అది కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం కొంత శాతాన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ క్రింద ఉంచుకుంది.. కాంట్రాక్టర్లు 15ఏళ్లపాటూ నిర్వహించాలి.. ఆ ఉన్నమొత్తాన్ని విడతలవారీగా చెల్లిస్తారు. నిజానికి ప్రస్తుత ప్రభుత్వం ఈ గాలేరు-నగరి కింద పెట్టిన ఖర్చును,పనులపురోగతిని ప్రజలముందు ఉంచగలరా?అసలీ పైడిపాలెం కంటే ఆయకట్టుకు పూర్తిగా ఉపయోగపడే చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ను నింపగలరా? ఇంతా చేసి ఈ హడవుడికి కారణం ఏమంటారా? స్థానిక నాయకుడి గడ్డం తీయించాలనే ఈ హడావుడి పనులు,ఆవెంటనే పంపులు అప్పేయడమేగా జరగబోయేదనుకుంటూ నవ్వుకుంటున్నారు పులివెందుల ప్రజలు.