జగన్ కు పెరుగుతున్న ఆదరణ.. వైసీపీలోకి మాజీ మంత్రి కుమారుడు…

3591
SHARE

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా ప‌ల్నాడు ప్రాంతంలో మంచి ప‌ట్టున్న కాసు కుటుంబం నుండి కాసు మ‌హేష్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో కందుల దుర్గేష్ తో పాటు ఆయన అనుచ‌రులు వైసీపీలో చేరారు.

ఇప్పుడు తాజాగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ త‌గిలింది. అయితే ఈ జిల్లాలో దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది. రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రిగా పద‌విని నిర్వ‌ర్తించిన స్వ‌ర్గీయ కోట‌గిరి విద్యాధ‌ర‌రావు కుమారుడు కోట‌గిరి శ్రీధ‌ర్ వైసీపీ కండువా క‌ప్పు కోనున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాల‌ నుండి విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఈనెల 29న కోట‌గిరి శ్రీధ‌ర్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో భారీ బ‌హిరంగ స‌భ‌లో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారు. ద్వార‌కా తిరుమ‌ల‌లో ఈ బ‌హిరంగ స‌భను ఏర్పాటు చేయ‌నున్నట్లు స‌మాచారం. కోట‌గిరి శ్రీధ‌ర్ తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వైసీపీలో చేర‌నున్నారు..