జగన్ గూటికి మాజీ ముఖ్యమంత్రి మనవడు..

217
SHARE

ఇప్ప‌టిదాకా జ‌గ‌న్ పార్టీ వికెట్లు ట‌ప‌ట‌పా ప‌డ్డాయి… ఒక్కొక్క ఎమ్మెల్యే జ‌గ‌న్ గూటి నుంచి జారుకుని సైకిల్ ఎక్కేశారు… చంద్ర‌బాబు వేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఎత్తుతో జ‌గ‌న్ చిత్త‌యిపోయాడ అని బాబు బావిస్తున్నారు. దాదాపు 20మందికి పైగా ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కి హ్యాండిచ్చి చంద్ర‌బాబు చెంత‌కు చేరిపోయారు… కానీ జగన్ మాత్రం అప్పడు ఎ మాటల మీద అయితే ఉన్నాడో ఇప్పుడు అదే మాచ ఉన్నాడు. చంచల స్వభావాన్ని అసలు ఎక్కడ చూపించలేదు. పార్టీ ముఖ్యం నేతలు కాదు ప్రజలు అని అనుకున్నాడు. ఫిరాయింపుల మీద కోర్టులో కేసు వేశారు., ఆ విషయం లో జాతీయ పార్టీ లు తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్ప‌టి దాకా జ‌గ‌న్‌కు నో కొట్టిన నేత‌లు ఇప్పుడు ఆయ‌న‌కు జై కొట్ట‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన యువ నాయకుడు కాసు మహేశ్‌ రెడ్డి త్వరలో వైఎస్ఆర్‌ సీపీలో చేరనున్నారు. వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం లోటస్‌పాండ్‌లో కాసు మహేశ్‌ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు.. వైఎస్‌ జగన్‌ను కలిసి చర్చించారు. పార్టీలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా కాసు మహేశ్‌ రెడ్డి ప్రకటించారు.మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు అయిన మహేశ్‌ రెడ్డి ఈ నెల 16న గుంటూరు జిల్లా నరసారావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించి ఆయన సమక్షంలో పార్టీలో చేరుతారు. ఆయన చేరిక వల్ల గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్‌ సీపీ మరింత బలపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.