వై.ఎస్సాఆర్ పార్టీ లో కి రావడానికి సిద్దమవుతున్న చిరంజీవి

10968
SHARE

కాంగ్రెస్ ఎంపీ, స్టార్ హీరో చిరంజీవికి వైసీపీ వచ్చే ఆలోచలనలున్నాయా? చరిష్మా ఉన్న మెగాస్టార్ ను తమ పార్టీలో చేరడానికి రెడీ గా ఉన్నాడా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న చిరంజీవి… ఆ తరువాత కాంగ్రెస్ ను వీడి మరో పార్టీలో చేరడం ఖాయమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఆయన టీడీపీలోకి వెళ్లడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని కొద్ది రోజుల పాటు హడావిడి జరిగింది. అయితే అదంతా వట్టిదే అని ఆ తరువాత తేలిపోయింది. కానీ… తాజాగా వైసీపీ ముఖ్యనేత అయిన అంబటి రాంబాబు చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరపడం ఈ సరికొత్త ఊహగానాలకు ఊతమిస్తోంది.

శుక్రవారం చిరంజీవిని కలిసిన అంబటి రాంబాబు… ఆయన కొత్త సినిమా ఖైదీ నంబర్ 150 విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చలు వచ్చాయని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై చిరంజీవి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా… ఆయన పార్టీ మారే అవకాశం ఉంటే కచ్చితంగా ఆయనను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని కొందరు నాయకులు చెబుతున్నారట. మొత్తానికి తమ పార్టీలోనూ తగినంత సినీ గ్లామర్ కచ్చితంగా ఉండాలని జగన్ పార్టీ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అయితే జగన్ పార్టీ 2014 ఎన్నికల్లో ఒడిపోవడానికి మూమ్మటికి కూడా సీనీ గ్లామరే కారణం. అయినా అప్పుడు జగన్ ఒడిపోయింది కేవలం 5 లక్షల ఒట్ల తేడా తో మాత్రమే, కానీ ఇప్పుటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 2019 లో ఎన్నికలు జరిగినా జగన్ గెలవడం ఖాయం..