భూమాకు చంద్రబాబు క్లాస్..

190
SHARE

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి… తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోవడం లేదా ? కర్నూలు టీడీపీలో శిల్పా చక్రపాణి బ్రదర్స్ తో కలిసి నడవలేకపోతున్న భూమా నాగిరెడ్డి… ప్రభుత్వ పరంగానూ అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ ప్రశ్నకు జిల్లా టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. జిల్లాలోని బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమా నాగిరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ కు షాక్ ఇవ్వాలని భావించిన టీడీపీకి… భూమా ద్వారా ఎప్పటికప్పుడు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఓ విషయంలో అతిగా వ్యవహరించిన భూమా నాగిరెడ్డిని చంద్రబాబు స్వయంగా తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది.

బుధవారం విజయవాడలో చంద్రబాబును కలుసుకున్న భూమా నాగిరెడ్డి…ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరణ ఇచ్చారు. అయితే నంద్యాల ప్రాంతంలో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ఓ తెలంగాణ కాంట్రాక్టర్ ను భూమా నాగిరెడ్డి తీవ్రంగా బెదిరించారని… ఆయన స్వయంగా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో ఏపీ సీఎం భూమాకు క్లాస్ తీసుకున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు భూమా తీరుతో విసిగిపోయిన చంద్రబాబు… ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా పక్కనపెట్టే అవకాశం ఉందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

జగన్ గారు సాక్షి ప్రెస్ మీటింగ్ చెప్పిన విషయం పై భూమా ఈ విదంగా అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చాలా స్పందిచారు అని అన్నారు ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రయత్నం చాలా అధ్బుతం అని చెప్పిన్నారు. జగన్ గారు విషయంలో బయట చెప్తుంది అంతా తప్పుఅని చెప్పిన్నాడు. ప్రతి ఒక్కరితో జగన్ అప్యాంగా అన్నా అని పలకరిస్తాడు. ఒక కుటుంబం సభ్యడిలా మాట్లాడుతాడు . జగన్ పార్టీలో ఉన్నంత ఫ్రీడం ఇంకా ఏ పార్టీలో ఉండదు . నేను కూడా ఒక ప్రాంతీయ పార్టి నుండి వచ్చిన వాడినే గా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు, కానీ జగన్ దగ్గర ఉన్నంత స్వేచ్చ వేరే దగ్గర ఉండదు .

అయితే ఎన్నికలు వచ్చే సమయాని కల్లా వై.ఎస్సాఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినా వారందరు కూడా మళ్ళీ పార్టీ లోకి వచ్చే ఆవకాశాలున్నాయి. ఎందుకంటే జగన్ నిర్వహిస్తున్నా యువభేరీ,గడప గడప కార్యక్రమం ప్రజల్లో కి బలంగా వెళ్ళింది.