అమరావతి నీ అబ్బ సొత్తా

956
SHARE

జనవరి 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అయిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతం లో ఉన్న గ్రామాలలో ప్రభుత్వం నిరంకుశత్వంగా వారిపైన చేస్తున్న అధికార దాడిని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వాళ్లకు అండగా ఉంటుంది వైఎసార్సీపి అని తెలియజేసి వాళ్ళ కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో పర్యటన చేస్తే, అడుగడుగునా పోలిసుల ద్వారా అడ్డుకొని ఆ గ్రామాలలో కెళ్లేందుకు అనుమతించలేదు.

ఒక ప్రజా నాయకున్ని ప్రజల చెంతకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు అంటే మీ ప్రభుత్వం వాళ్ళపైన చేస్తున్న అధికార దాడి ఏవిధంగా ఉందొ అర్థం అవుతోంది.
ఎక్కడ జగన్ గారు వాళ్ళను కలిస్తే కష్టాలను తెలుసుకొని ప్రభుత్వాన్ని ఇరకాటం లో పడేసి ఇబ్బంది పెడతాడో అని భయమా ??

సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది అని జగన్ గారిని అడ్డుకున్నా కూడా ప్రజలు ఆయన్ను కలిశారు. సచివాలయ ప్రాంతం లో 144 సెక్షన్ ఉంది, ఆ నిబంధన ఉంది ఈ నిబంధన ఉంది అని సవాలక్ష కారణాలు చెప్పి ముఖ్యమంత్రి తర్వాత కాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తిని ఆపిన అధికారం, నిన్న అదే ప్రాంతం లో తెలుగు దేశం కార్యకర్తలు అహంకారం తో మదమెక్కిన ఆంబోతుల లాగ తిరుగుతూ ఒక ప్రజా నాయకుడు తిరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేయాలనీ ప్రత్యర్థి పార్టీ నాయకులను అనరాని మాటలు అనడం వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నాం.

మా నాయకుడు జగన్ గారు తిరిగిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వాళ్ళ ఆ పార్టీ వాళ్లకు ఉన్న కండకావరం ఏంటో, వాళ్ళ అహంకార పోకడలను చెపుతోంది.
ఈ పర్యటన లో జగన్ గారు తిరిగిన ప్రాంతం దళిత వాదాలు, బడుగు బలహీన ప్రజలు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని శుద్ధి చేయడం తో వారు సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఇంకా అంటరానితనం లాంటి జాడ్యాలు ఉన్నాయని, వాటిని తెలుగుదేశం పార్టీ పెంచి పిస్తోంది అనేకదా ??

మా నాయకుడు తిరిగాడని ఇన్ని చేస్తున్న వాళ్లకు మాదొక విన్నపం. వాళ్ళ నాయకుడు గురించి వాళ్లకు కొన్ని విషయాలు తెలుసో తెలియదో చెప్తాము విని తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం ఎవరికీ చేయాలో తేల్చుకోండి.

ఒంటినిండా జబ్బులు పెట్టుకొని, ఒకరోజు వేసిన దుస్తులను ఇంకొకసారి వేయని(ఉతికిన తరువాత ), ప్రతిరోజు నీళ్లతో కాకుండా కెమికల్స్ తో స్నానం చేసి, ప్రతిరోజు ఉదయం 2గంటలకు తగ్గకుండా స్నానం చేస్తూ, విడిచిన బట్టలను దూరంగా తీసుకెళ్లి కెమికల్స్ పోసి కాల్చేసి, క్రమం తప్పకుండా సుగంధ ద్రవ్యాలను కొట్టుకుంటూ తనలోని జబ్బులను బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆపసోపాలు పడుతున్న అయన తిరిగితే శుద్ధి చేయాలా ? ( ఈ విషయం మీడియా మిత్రుల ద్వారా తెల్సుసుకోవడం జరిగింది)

మా నాయకుడు ఆరోగ్యవంతుడు, ఎటువంటి చేదు అలవాట్లు లేవు, ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి.

ఇప్పుడు తేల్చుకోండి శుద్ధి కార్యక్రమం ఎవరికీ చేయాలో!!

అయినా ఈ శుద్ధి కార్యక్రమాలేంటి ?? ఒక రాష్ట్ర రాజధాని లో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తిరిగొద్దా?/ మన్మ ఎక్కడ ఉన్నాం ? నీరో చక్రవర్తి పాలనా? హిట్లర్ పాలనా ? ఈ వింత పోకడలు ఏంటి ? అమరావతి ఎమన్నా తెలుగుదేశం నాయకుల అబ్బా సొత్తా ?

ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాని సమాజానికి ఉపయోగపడే పనులేమన్న చేస్తే సమాజంమ్ మిమ్మల్ని చూసి హర్షిస్తుంది !!