ఆంధ్రప్రదేశ్ కు పట్టిన ఖర్మ.. నారా లోకేశ్‌కు మంత్రి పదవి కన్ఫార్మ్‌…

1076
SHARE

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తెలుగుదేశం పార్టీని నారా లోకేశ్‌ ఒక్కరే బతికించగలరని, చినబాబును తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేయాలన్న తెలంగాణ నాయకుల వేడుకోలును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా తిరస్కరించారు. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా లోకేశ్‌ను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగాకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోకి చేర్చుకోవాలని బాబుగారు కన్ఫార్మ్‌ చేసినట్లు తెలిసింది. నేడో రేపో చినబాబు ఏపీ ప్రభుత్వంలో చేరతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ కోటాలో లోకేశ్‌ను చట్టసభకు ఎంపికచేసి, వెనువెంటనే మంత్రి పదవి కట్టబెట్టాలని చంద్రబాబు తమతో అన్నట్లు టీటీడీపీ నాయకులు తెలిపారు. లోకేశ్‌ను మంత్రిని చేయాలని చంద్రబాబు ఎప్పటినుంచో పావులు కదుపుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు నాయకులు చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో సినియర్‌ మంత్రులను సైతం నిలబెట్టి ​’నిలదీయగల’ సత్తా ఉన్ననేతగా లోకేశ్‌ ఇప్పటికే తన మార్కును చాటుకున్న సంగతి తెలిసిందే.