చంద్రబాబు కాపురం పెట్టాక విజయవాడలో అవినీతి ఉత్తమ్..

358
SHARE

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ఏపీ వ్యాపార రాజధానిగా పేరుగాంచిన కృష్ణాజిల్లా విజయవాడలో రాజకీయ,అధికారుల అవినీతి పేట్రేగిపోయిందని తెలుస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే ఇక్కడ అవినీతి చాలా ఎక్కువగా ఉందని ఆపార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సర్వేల్లో కూడా ఇదే విధంగా ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలుకూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారట. వీరంతా అవినీతికి పాల్పడడంతోపాటు క్రింది స్థాయినుంచి అవినీతికి పాల్పడుతున్నారట.. గతంలో కాల్‌మనీ వ్యవహారంలోకూడా పెద్దఎత్తున టీడీపీనేతలు ఇందులో ఉన్నట్టు భారీ ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాలు అమలులో కూడా ఈ అవినీతినేతలు పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లోకూడా దాదాపుగా ఈ పరిస్థితే కనిపిస్తోందట.. టిడిపి నాయకులు లంచాలకు ఎగబగుతు్ననట్టు సమాచారం.

విజయవాడ, బందరు, గుడివాడలలో పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజాసేవ, రాజకీయం మాని వ్యాపారాలు, గూండాగిరిలతో వర్ధిల్లుతున్నారని తెలుస్తోంది. రాజకీయంగా విచ్చలవిడి అవినీతికి పాల్పడుతుండడంతో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం గతంలో కన్నా మరింత తగ్గిపోయిందని తెలుస్తోంది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి ‘కొల్లు రవీంద్ర’లపైనా లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు బోండా ఉమ, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌రావు ఇతర ఎమ్మెల్యేలు కూడా పెద్దఎత్తున అవతవకలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.