కాకి లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్న బాబు..

269
SHARE

దేశ జీడీపీ కంటే ఆంధ్రప్రదేశ్‌ జీడీపీ ఎక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనని, ఎక్కడా వాస్తవాలకు దగ్గరగా లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేస్తుందని ప్రశ్నించారు.

దేశంలో ఎక‍్కడాలేని వృద్ధిరేటు ఏపీలో ఉందంటే నమ్మశక్యమేనా అని పార్థసారథి నిలదీశారు. మాయమాటలతో ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని, వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడేలా చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒంగోలు కలెక్టరేట్‌ ముందు జరిగే ధర్నాలో వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని చెప్పారు.