వైకాపా లోకి మరో సినీ నటి..

4951
SHARE

టాలీవుడ్ లో హాట్ ఆంటీగా ఇమేజ్ తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ … వైకాపా లోకి జంప్ చేస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి !! గత ఎన్నికల్లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హేమ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున తూగో జిల్లా మండపేట నుండి పోటీ చేసింది. కనీస డిపాజిట్ కూడా దక్కించుకోకుండా ఓడిపోయింది ? టిడిపి హవాలో కొట్టుకుపోయింది.

దాంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అయిన ఈమె మరోసారి పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో గెలిచి ఎంఎల్ ఏ కావాలనే గట్టి సంకల్పంతో ఉన్న హేమ ఈ సారి టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంది? లేటెస్ట్ గా కాపు రిజర్వేషన్స్ అంటూ అందరి దృష్టి ఆకట్టుకునే పనిలో పడింది.

కాపులకు బాబు అన్యాయం చేస్తున్నారంటూ ఈమె హంగామా మొదలు పెట్టి చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తుంది. దాంతో పాటు టిడిపికి వ్యతిరేకంగా పోరాడాలంటే వైకాపా బెటర్ అని ఆ పార్టీ లో చేరేందుకు సన్నాహాలు చేస్తుందట !! మరి వైకాపా లో హేమ చేరితే రోజా తో పాటు మరో ఫైర్ బ్రాండ్ తోడయినట్టే !! ఏమంటారు !!

అయితే మరి జగన్ సేనా హేమ ని వైకాపా లో కి ఆహ్వనిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే ఆ పార్టీ లో రోజా వైకాపా పార్టీ క్రియా శీలకం గా నటిస్తోంది.